|
హన్మకొండ,నవంబర్ 15-11-2022 తెలంగాణ సహకార గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు , TGOs అసోసియేషన్ జిల్లా కోశాధికారి ఈగ వెంకటేశ్వర్లు సతీమణి స్వర్గీయ ఈగ లావణ్య చిత్ర పటానికి నేతలు శుక్రవారం రాత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈగ లావణ్య 1-11-2022 రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే!
నేడు వారి స్వగృహమైన నక్కలగుట్ట నందు కీ.శే. ఈగ లావణ్య గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షులు ఏ జగన్మోహన్ రావు , రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీనివాస మూర్తి , కోశాధికారి గంధం శ్రీనివాసరావు , సహా అధ్యక్షులు నాగేశ్వర్ రావు నాయకులు మార్గం రాజేష్ , ఆర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు |